ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా గిఫ్ట్ లుగా స్వీట్స్ వస్తాయి. పండగ కోసం స్వీట్లు చేసేటప్పుడు మర్చిపోవద్దు. చక్కెర తో కాకుండా బెల్లంతో స్వీట్లు తయారు చేసుకోండి గోధుమపిండి పాలు బెల్లంతో చేసిన పన్నీర్ మిఠాయి లాంటి శ్వీట్లు మంచివే. ఒకసారి వాడిన నూనెలో మళ్ళీ శ్వీట్లను వేయించవద్దు. బయట పార్టీలకు వెళ్ళినప్పుడు రోజూ అలవాటుగా తినే తిండి తినే బయలుదేరాలి. ఆకలితో వుంటే  ఏ స్వీట్లో వేపుల్లో ఎక్కువ తినేసే ప్రమాదం వుంది. పండగ వేళలో ఎక్కువ క్యాలరీల తీసుకుంటారు కనుక నీళ్లు ఎక్కువ తాగాలి. తిండి వేళలో  తేడా వస్తుంది. నీళ్లు మరిన్ని తాగక పొతే డీహైడ్రేషన్ వచ్చే అవకాశం వుంది. పండగైనా మామూలు రోజులైనా ఎంత ఇష్టపడ్డా  పరిమితంగా తినాలనే రూల్ దాటాకపోతే డైటింగ్ గురించిన ఆలోచనే వద్దు.

Leave a comment