నీహారికా,

మన్యుషుల మధ్య ముఖ్యంగా భార్యా భర్తల మధ్య వచ్చే విభేదాలకు పెద్ద కారణం ఉండనక్కరలేదు. చాలా చిన్ని సమస్యలే దూరం పెంచుతాయి. అలాంటివి ఎదురయ్యినప్పుడు తప్పనిసరిగా చేసుకోవలసింది ఆపాటి వరకు గడిపిన జీవితాన్ని, పెంచుకున్న ప్రేమని, పెంచుకున్న అనుభందాలని. పెళ్లి అయిన కొత్తలో ఎలా వుండే వాళ్ళో గుర్తు చేసుకుంటే ఇవ్వాల్టి తగవు అడ్డం పైని ఆవగింజలా జారి పోతుంది. భర్తే కనుక అన్నీ ఆటను తెలుసుకోవాలని భారిచాలని అనుకుంటే అది భార్య  పొరపాటు. అలాగే భార్యే కదా ఆమె అర్ధం చేసుకోవాలని సర్దుకు పోవాలని భావిస్తే అది భార్య పొరపాటు. ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ జీవితంలోని ఒత్తిడి, కష్టం ఇద్దరికీ పని వత్తిడిగా తెలుసుకోవచ్చు. అలా కాకుండా భార్య గృహిణి గా వుంటే భర్త ఆమె శ్రమ ని అంటూ లేని విసుగు వచ్చే చాకిరీని అర్ధం చేసుకోవాలి. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన భర్త కుటుంబం కోసం ఆఫీసు లో వంచిన తల ఎత్తకుండా సాయంత్రం వరకు పనిచేస్తుందని, భార్య అర్ధం చేసుకోవాలి. ఒకరి పైన ఒకరికి వున్న ప్రేమను శ్రద్ధను ఒక్క నిమిషం గుర్తు చేసుకుంటే సమస్యలు దుదిపింజల్లా ఎగిరిపోతాయి.

Leave a comment