ఫ్యాషన్ గురించి అప్ డేట్ గా ఉండటం అంటే దుస్తుల విషయంలో కొత్త డిజైన్స్ ఎంచుకోవాలి. ముందుగా రంగుల గురించి తెలుసుకోవాలి అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. ప్రతి సంవత్సరం కొన్నీ కొత్త రంగుల్నీ ఫ్యాషన్ ప్రపంచం గుర్తిస్తుంది. వాటిని వాటి ఛాయలను ఎంచుకోవాలి. ఎరుపు ,గులాబీ,ఐస్ బ్లూ ,ఆకాశనీలం పసుపు ,ఆకుపచ్చ వంటివి ఎప్పటికీ ఫ్యాషన్ వర్ణాలు. ప్రతి సారి ఎంపికలో మ్యాచింగ్ చూసుకోవాలి కొన్నీ కాంబినేషన్స్, ఆకుపచ్చ-నీలంరంగు, గులాబీ-ఆరెంజ్ , ఎల్లో-బ్లూ వంటివి పర్ ఫెక్ట్ మ్యాచింగ్ రంగులు .డ్రెస్ మొత్తం ఏకరంగులో కాకుండా లేతరంగులు ,గాఢమైన వర్ణాలు సరైన మిక్సింగ్ తో ఉండాలి. లేదా ఒకే రంగు కావాలనుకొంటే ఒకటి సాదా ఒకటి డిజైన్ తో ఉండేలా చూసుకొంటే ఎప్పుడు కొత్తగా అప్ డేట్ గా కనిపించవచ్చు.

Leave a comment