కేరళ లోని కాన్పూర్ లో పుట్టిన నివేతా ధామస్ ఎనిమిదేళ్ళ వయస్సులో 2002 లో ఉత్తర సినిమాలో నటించి, బాల నటిగా కేరళ ప్రభుత్వం ఇచ్చే అవార్డు అందుకుంది. అటు తర్వత మూడు దక్షిణ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్నా తెలుగులోనే ఆమెకు అభిమానులున్నారు. జంటిల్ మెన్, నిన్ను కోరిలో ఊహించని గుర్తింపు వచ్చింది ఆమెకు. జీవితంలో మళ్ళి మళ్ళి అలాంటి అవకాశంరాదేమో నన్నంతకోరికతో పాపనాసం దృశ్యం తమిళ రీమేక్ లో కమల్ హాసన్ కూతురిగా నటించడం తన అదృష్టం అంటుంది. నివేతా షూటింగ్ పూర్తి అయ్యే సరికి ఆయన నిజంగానే నాన్నాఅనే ఫీలింగ్ వచ్చింది. ఆయన్ని తెరపైన చూడటమే ఎక్సయిట్ మెంట్ ఇక నటించడం అంటే నా ఫీలింగ్స్ చెప్పలేను అంటుంది నివేతా అమ్మా ఇల్లీ. నాతోనే చెన్నయ్ లో వుంటుంది. నాన్న షాజు ధామస్ దుబాయ్ లో ఉంటాడు. నిఖిల్ నా తమ్ముడు. ఆర్కిటేక్చర్ నాకు ఇష్టమైన సబ్జక్ట్. అటు తర్వాత పూర్తిగా సినిమాలే అంటుంది నివేతా.

Leave a comment