స్త్రీలలో రొమ్ము కాన్సర్ ఎక్కువగా కనిపించటానికి వాళ్ళు వాడే బ్యూటీ క్రీములు లోషన్లు కూడా కారణం కావచ్చు అంటున్నారు పరిశోధికులు. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం లేదా అందం కోసం వాడే సన్ స్క్రీన్లు  కాస్మెటిక్స్ లోని రెండు రకాల రసాయనాలు రొమ్ము కాణాల్లోని  డి ఎన్ ఎ ని దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. సన్ స్క్రీన్  లో ఉపయోగించే బెంజోఫీనోన్-3 అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షితోంది. అలాగే కాస్మెటిక్స్ లో ప్రిజర్వేటివ్ ప్రొఫైల్ పారాబెన్ వాడు తుంటారు. చర్మాన్ని రక్షించే ఈ రెండు పదార్ధాలు రొమ్ము కణాలపైనా దుష్ప్రభావం చూపిస్తున్నాయని పరిశోధికులు చెపుతున్నారు.క్షీర గ్రంధుల మీద ఇవి చూపించే ప్రభావాన్ని పరిశీలించగా అవి ఆ కాణాల్లోని డి ఎన్ ఎ ని దెబ్బతీసి ఆ ద్వారా కాన్సర్ కు కారణం అవుతున్నాయి.

Leave a comment