ఈ సీజన్ లో తడి, చెమ్మ వలన కప్ బోర్డ్ ల్లో దుస్తులు దుర్వాసన గా ఉంటాయి కొన్ని చిట్కాల తో ఈ సమస్య పోతుంది. విడిచిన బట్టలు ఎప్పుడు కుప్పగా పడేయ వద్దు ఏ ఒక్కటి తడిగా ఉన్న ఆ బట్టలన్నీ వాసన వేస్తాయి. ఉతికిన దుస్తులను వీలైనంత వరకు ఎండలో ఆరవేయాలి పూర్తిగా ఆరిపోయిన తర్వాత తడి చెమ్మా లేని చోట హాంగర్లకు తగిలించాలి. ఆరుబయట ఆరవేసే సౌకర్యం లేకపోతే వెంటిలేషన్ ఉన్నచోట ఆరబెట్టాలి గదిలో ఫ్యాన్ గాలి తగిలే చోట ఉంచాలి దుస్తులు ఉతికే సమయంలో వాషింగ్ పౌడర్ తో పాటు వెనిగర్ కాని బేకింగ్ సోడా కానీ వేస్తే దుస్తులు దురవాసన రావు.

Leave a comment