వారానికి  ఒక్కరోజు తప్పని సరిగా ఉపవాసం ఉండండి మేలైన ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఉపవాసం కారణంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి మధుమేహం బారిన పడే అవకాశాలు దూరం అవుతాయంటున్నారు. అధిక రక్తపోటు, గుండె కొట్టుకొనే స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమబద్ధం అవుతాయంటున్నారు. ఒక్క రోజు ఉపవాసం కారణంగా నాడీ మండల వ్యాధులు తగ్గుముఖం పడతాయని వారి పరిశోధనలో తేలింది. అయితే పసి పిల్లలు, వృద్ధులు, గర్భావతులు, ఇప్పటికే మధుమేహంతో భాద పడేవారు, ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు ఈ ఉపవాసం చేయొద్దని చెప్తున్నారు.

Leave a comment