మా టివి  శశి రేఖా పరిణయం సీరియలో నటించిన మేఘనా లోకేష్ ఇది మా ప్రేమ కథ సినిమాతో వెండి తెరపైకి అడుగు పెట్టింది. గత పద్దెనిమిది సంవత్సరాలుగా దియేటర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. 300 వరకు స్టేజి షోలు ఇచ్చిన మేఘన లోకేష్ జీ తెలుగులో కళ్యాణవైభోగం సీరియల్ లోనూ నటిస్తుంది. బుల్లి తెర, వెండి తెర పడే కష్టం అంటే దేనికదే అంటోంది మేఘన. సీరియల్స్ వల్ల లాభం ఏమిటంటే ప్రతిరోజు ప్రేక్షకుల దగ్గరకు రావొచ్చు. సినిమా సక్సెస్స్ అయితేనే ఆ రెండున్నర గంటల్లోనే భవిష్యత్ ముడిపెట్టుకోని ఉంటుంది. కొన్ని నెలల పాటు సీరియల్ కొనసాగుతోంది కనుక ఎదో ఒక ఎపిసోడ్ లో నటన బావుండక పోయినా, మిగతా ఎపిసోడ్స్ లో మెప్పించవచ్చు. మేఘన కన్నడ అమ్మాయి. అక్కడ సీరియల్స్ చేస్తూనే దక్షినాది సీరియల్స్ లోకి, ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెట్టింది.

Leave a comment