Categories
శరీరానికి తగిన శక్తి సమ కూర్చుకోనేందుకు సహకరించి చక్కని నిద్రకోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ముందుగా చక్కని కాటన్ దుప్పట్లు మంచి నిద్రను ఇవ్వగలవు. మృదువుగా వెచ్చదనం ఇచ్చే ఊలు దారాల కాటన్ దుప్పట్లు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి. శుభ్రమైన మంచి వాసన వచ్చే దుప్పట్లు, చక్కని పరుపు, నిశబ్ధంగా ఉండే వాతావరణం చాలా అవసరం. నిద్రించే ముందర లూజ్ గా ఉండే పైజమా కంఫర్ట్ గా ఉంటుంది. నిద్రలో అటు, ఇటు తిరిగిన వంటికి అంటిపెట్టుకొని ఉంటుంది కనుక చల్లదనానికి నిద్ర మెలుకువ రాదు. పాదాలకు వెచ్చదనం ఇచ్చేందుకు సాక్స్ వేసుకోవాలి. పడుకొనే ముందు చల్లని పానీయాలు తాగకూడదు. పంచదారకు బదులుగా తేనే వేసిన వేడి, వేడి పాలు నిద్రను ఇస్తాయి.