Categories
ఎలర్జీ, ఆస్తమా వుంటే చాలా శ్రద్దగా ఉండ వలసి వస్తుంది. బయటి కాలుష్యాలే కాకుండా ఇంట్లోను ఎలర్జీ కారకాలు దాగి ఉంటాయి. వీటిని దూరంగా ఉంచాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి పాలు, పాల ఉత్పత్తులు పడకపోవచ్చు. అతినీల లోహిత కిరణాలు చర్మమలో ఉన్న ప్రోటీన్ తో ప్రతి చార్య జరపడం వల్ల కుడా ఎలర్జీలు రావచ్చు. ఈ ఎలర్జీలు రాకుండా, ఆస్తమా భాదిన్చాకుండా ఉండాలంటే ప్రతీ వారం కర్టెన్స్ ఉతకాలి.కార్పెత్స్ వ్యాక్యుమ్ క్లీనింగ్ చేయాలి. పరుపులకు డస్ట్ ప్రూఫ్ కవర్లు వేయాలి. దుప్పట్లను మూడు నాలుగు రోజులకోసారి వాష్ చేయాలి. పెంపుడు జంత్వుల ను నిద్రించే గదిలో ఉంచుకోవద్దు. ఇంట్లో కిటికీల్లో దుమ్ము లేకుండా శ్రద్దగా వుండాలి.