ఈ వేసవి ఎండలు మార్చేసినా ఎన్నో రుచికరమైన పండ్లు కూర గాయలు మాత్రం పుష్కలంగా ఇస్తుంది.వాటిపై దుమ్ము ,ధూళి రసాయనాలు,క్రిమి సంహారక మందుల విషయంలో కాస్త అనుమానం ఉంటుంది. ద్రాక్ష ,యాపిల్, మామిడి, స్ట్రాబెర్రీ వంటి పండ్లపై రసాయనాలు పూతలాగా పేరుకోని ఉంటాయి. గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పువేసి ఈ పండ్లను మునిగేలా చేసి రుద్ది కడగాలి ఉప్పు బదులు వెనిగర్ కూడా వేయవచ్చు. ఆకుకూరల్ని వంట సోడ వేసిన నీళ్ళలో మునిగేలా ఉంచి గోరువెచ్చని నీళ్ళలో మునిగేలా ముంచి అందులో ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి.

Leave a comment