Categories
ప్రాంచంలో చాలా ఎక్కువ మంది ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్ధాలు తింటూనే ఉంటారు. భార్యా భర్తా ఉద్యోగాలు చేసే ఈ కాలంలో ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకునే పదార్ధాలు ఎక్కువే. ఉదయం వండిన వంట రాత్రి వేడిచేసుకుని తినడం కొన్నింటిని రెండు రోజులు వాడుకోవడం అలవాటే కానీ ఫ్రిడ్జ్ లో జరిగే శీతల ఉష్ణోగ్రతల రాసాయినిక చర్య కారణంగా నిల్వ ఉంచిన పదార్ధాలు తినడం వల్ల కాన్సర్ కారకాలు అభివృద్ధి చెందవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రిడ్జ్ లో ఎక్కువగా ఉంచుకునే పాలల్లో బాక్టీరియా వృద్ధి చెంది పలు అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు అనీ ఎక్స్ పర్ట్స్ ఊహిస్తున్నారు. ఉల్లిపాయ , దుంపలు , టమాటాలు ఫ్రిడ్జ్ లో ఉంచ కుండా బయట వాతావరణం లో ఉంచడం మంచిది.