Categories
చలికాలం వెనక్కి పోతుంది. సూర్యకిరణాలు వేడేక్కుతున్నయి కొన్ని పూతలు చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా చల్లదానాన్నిస్తాయి. వేప,కమల పండు గుజ్జు ,ముల్తాని మట్టి,చందనం సమపళ్ళాలో తీసుకోని మెత్తగా కలిపి దానికి తేనే అరచెంచా నిమ్మరసం ,రోజ్ వాటర్ కలిపి ముఖానికి,మెడ కి రాసుకోని పూర్తిగా అరేవరకు ఉండి చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. మెత్తని బియ్యం పిండి,కొంచెం పసుపు ,కొంచెం తేనే దానికి కీరా రసం కలిపి పేస్ట్ లా చేయాలి. పూతని మెడకి,ముఖానికి వేసుకున్నక చల్లని నీటితో కడిగేస్తే చర్మం బిగుతుగా రావడమే కాకుండా తాజాగ కనిపిస్తుంది.