మొహంపై నల్లని మచ్చలు పడతాయి. ఈ నలుపు విరిగేలా చేయాలంటే కొన్ని సహజమైన పద్దతులే మంచి ఫలితం ఇస్తాయి. పాలల్లో సెనగ పిండి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ముఖం మెడ చేతులకు పట్టించి ఒక పావుగంట ఆగి కడిగేస్తే సరిపోతుంది. ట్యాన్ తొలగించడంలో నిమ్మరసం, తేనె కుడా బాగా పనిచేస్తాయి. ఇవి సమపాళల్లో తీసుకుని మొహం పైన అప్లయ్ చేసి 20 నిమిషాలు ఆరనిచ్చి, మెయిల్డ్ క్లన్సర్ తో కడిగేస్తే సరి. ఒక టీ స్పూన్ పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే, ఆరెంజ్ లోని విటమిన్ సి సహజ ఆల్ఫా హైడ్రాక్సిట్యాన్ ను తొలగిస్తాయి. పెరుగు చర్మానికి తగిన తేమ ఇస్తుంది. గోరువేచ్చబి నీళ్ళ తో మొహం కడిగేసుకుంటే జిడ్డు పోతుంది. ఈ టిప్స్ కొన్నాళ్ళపాటు చేస్తూ వుంటే మోహ పై నలుపు పోతుంది.

Leave a comment