కొబ్బరిని వాడవలసిన పద్దతిలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. వారి సలహా ప్రకారం వర్జిన్ కోకోనట్  ఆయిల్ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది వంట అవసరాలకే  కాకుండా  పొడి చర్మం గలవారికి మసాజ్ ఆయిల్ గా కుడా చాలా ఉపయోగం. పొడి చర్మం గలవారికి మసాజ్ ఆయిల్ గా కుడా  చాలా ఉపయోగం. పొడిగా దళసరిగా వున్న చర్మం పైన అప్పుడే ఫ్రెష్ గా తీసేసిన కొబ్బరి పాలలో కొంచెం చందనం కలిపి  అప్లయ్ చేసి మంచి ఫలితం వుంటుంది. కొబ్బరి నీళ్ళు స్వచ్చమైన డ్రింక్. అలాగే కొబ్బరి పాలలో మధ్య స్ధాయి ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, పాస్పరస్ పుష్కలంగా వున్నాయి. ఆతలాడే పిల్లలకు కొబ్బరి పాలలో చక్కర కలపకుండా తాగేందుకు ఇస్తే ఎంతో మంచిది. ఇక కొబ్బరి నీళ్ళలో సోడియం, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్ మరెన్నో ఎంజైములున్నాయి. కొబ్బరి నూనెతో చేసిన ఆహారం ఆరోగ్యకరం అని చెప్పుతున్నారు.

Leave a comment