Categories
సినిమాల్లోకి రాకపోయి వుంటే తప్పకుండా ఫ్యాషన్ డిజైనర్ ని అయ్యుండే దాన్ని అంటోంది కీర్తి సురేష్ . ఆ రంగం కూడా నాకు చాలా ఇష్టం . ఫ్యాషన్ డిజైనింగ్ లో అభిరుచి ఉండటం వల్లనే నేను నా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి ,ఎలాంటి పాత్రలకు ఎలాంటి దుస్తులు ధరించాలి అన్ని విషయాల్లో నా అవగాహన మరింత పెరిగింది . నా వృత్తికీ నాకూ ఆ అభిరుచి ఉపయోగ పడింది . సినీలల్లో నా వస్త్రధారణ బావుండటానికి కారణం అదే . ఒక పనిని ప్రేమిస్తే ఆ పని చేయటంలో ఆనందం కలుగుతుంది . నేను ఏ రంగాన్ని ఎంచుకొన్నా ,అందులో ఖచ్చితంగా విజయం సాధించే దాన్నే . నేను దేనయినా మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను అంటోంది కీర్తి సురేష్ . ఈ లక్షణం వల్లనే చిన్నవయసులో మహానటిలో అంత బరువైన పాత్ర ని పోషించ గలిగింది .