Categories
‘ ది డయానా అవార్డ్ ‘ గెల్చుకుని ఛేంజ్ మేకర్ గా నిలబడింది గర్విత గులాటి. వై వేస్ట్ అనే ఫౌండేషన్ స్థాపించి నీళ్లు ఎలా వృద్ధి అవుతున్నాయో ప్రచారం చేసింది.ఆ వృధా అరికట్టే దిశగా అడుగులు వేసింది.ఆమె స్లోగన్ ‘ గ్లాస్ హాఫ్ ఫుల్ ‘ హోటళ్లలో రెస్టారెంట్స్ పూర్తి గ్లాసు నీళ్ళు టేబుల్ పై పెట్టకుండా సగం గ్లాసు నీళ్ళు ఇస్తే ఎంత వృధా అరికట్టవచ్చో ప్రచారం చేసింది.దేశ వ్యాప్తంగా ఐదు లక్షల రెస్టారెంట్స్ ఈ ఆలోచన పాటిస్తామని ముందుకు వచ్చారు.ఈ కాంపెయిన్ మనదేశంలో కాకుండా ఒమన్, ఫిలిప్పీన్స్, యూరోప్, దక్షిణాఫ్రికా లో కూడా విజయవంతంగా వెళ్ళింది. యువతను ఛేంజ్ మేకర్ గా ప్రకటిస్తూ ఇచ్చే ‘ ది డయానా అవార్డ్’ గర్విత గులాటి సొంతం అయ్యింది.