Categories
స్మార్ట్ ఫోన్స్ అస్తమానం చేతిలో ఉంచుకోవడం వలన తల,మెడ,బుజాల నొప్పులు వస్తాయంటున్నాయి అధ్యయనాలు. వీటితో పాటు చర్మానికి ఇబ్బందులు తప్పవంటున్నారు. ముఖ్యంగా స్త్రీలకు మెడ వెనుక కాలర్ బోన్ దవడల పక్కన చర్మం సాగిపోతుంది. ఫలితంగా ముందే ముడతలు వచ్చేస్తాయి. ఇదివరకు మెడ పై చర్మానికి నలభై దాటాక ముడతలు వచ్చేవి. ఇప్పుడైతే 18 ఏళ్ళు దాటుతుండగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు అధ్యాయనకారులు. ఫోన్ లేదా టాబ్ వైపు మెడ వంచి చూస్తూనే ఉండటం వల్ల చర్మం ఈ విధంగా సాగిపోతుంది. మెడ కండరాలు స్ట్రెయినై మృదువైన టిష్యూలు కాంట్రాక్ట్ అవుతాయి గనుక ఎక్కువ ఫోన్ వాడటం మానమంటున్నారు.