పాదాలపై పగుళ్ళు చాలా ఇబ్బంది పెడతాయి. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఈ సమస్య ఉంటుంది. నువ్వుల నూనె మస్సాజ్ తో ఈ పగుళ్ళ బాధ పోతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయం లేస్తూనే కాళ్ళు స్క్రబ్ చేసి మురికి లేకుండా చేసి నూనెతో మస్సాజ్ చెయ్యాలి. ఓ అరగంట అలా వదిలేసినా లేదా సాక్స్ వేసుకొని పనులు చేసుకొన్నా పర్లేదు. ఆ అరగంట లోనూ నూనె ఇంకి పోయి పాదాలు మెత్తగా అయిపోతాయి. పగుళ్ళు క్రమంగా పోతాయి. ఇదేవిధంగా కొబ్బరి నూనె వాడినా ఇదే ఫలితం ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో మస్సాజ్ చేస్తే దుప్పట్లు నూనె వాసన వస్తాయి. ఆ నూనె వదిలించటం కష్టం అయిపోతుంది. ఉదయమే కానక్కర్లేదు కాళ్ళకు విశ్రాంతి ఇచ్చే ఏ అరగంట పాటైన ఈ మస్సాజ్ కొనసాగించవచ్చు.

Leave a comment