Categories
రసాయనాలు నిండిన క్రీమ్స్ కంటే ఇంట్లో దోరికే సహజమైన వస్తువులతో ఫేస్ ప్యాక్ చాలా మంచిది అంటారు. తేనెతో మోహం మీద చేతితో మర్ధన చేసుకుంటే ముఖం తాజాగా వుంటుంది. గులాబి రేకుల గుజ్జు, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంతో మొహం పై ప్యాక్ లాగా వేస్తే ఓ అరగంట తర్వత అరిపోయాక వేడి నీళ్లతో కడిగేసుకుంటే బావుంటుంది. బంగాళా దుంప రసం తీసి ముఖానికి రాసుకోవాలి. విటమిన్ సీ చర్మంలోని నలుపుని మాయం చేస్తుంది. అరటి పండు గుజ్జులోని తేనె పెరుగు,గుళాబి నీళ్లు కలిపి మొహం ,మెడపై పూతలా రాస్తే నలుపు తగ్గి చర్మం మెరుస్తుంది.ఈ ఫేస్ ప్యాక్ లు వేసుకున్నాక చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి . మొహం పై మాయిశ్చరయిజర్ రాస్తే చర్మం తేటగా ఉంటుంది.