అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది కనుక నేను ప్రమాదం నుంచి బయటపడి నా బిడ్డ మొహం చుశాను. మరి వైద్యానికి నోచుకోని సామాన్యులను ఆదుకోవల్సిన బాధ్యత మనందరి పై ఉంది అంటుంది విఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ . సీఎన్ఎస్ కు ఒక ప్రత్యేకమైన లేఖ రూపంలో ఆమె తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
పాపాయి ఒలంపియాకు జన్మనిస్తూ తను అనారోగ్య సమస్య ఎలా ఎదుర్కోన్నానో చెప్పారు. సిజేరియన్ సమయంలో పోట్టలో రక్తం గడ్డకట్టి పెద్ద ముద్దలా ఏర్పడటం ద్వారా ప్రాణాపాయ స్థితిలోకి జారిపోయానని , ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడానని ఆమె ఆ ఉత్తరంలో రాశారు. ప్రతి మహిళకు మంచి వైద్యం దక్కాలని బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు మెరుగైన వైద్యం అందిచటం ద్వారా 80 శాతం మరణాలను నివారించవచ్చని ఆమె ఆ లేఖలో రాశారు. ఇది సెరెనా విలియమ్స్ అనుభవం మాత్రమే కాని వైద్యానికి నోచుకోని మత్యువుకు దగ్గరయ్యే సమస్యల్లో ఇరుక్కునే కోట్లాది మంది సమస్య కుడా. ప్రపంచం మొత్తం ఈ సమస్య గురించి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.

Leave a comment