చుట్టూ వాతావరణంలోని దుమ్ము ధూళి తో పెరుగుతున్న ఎండ వేడితో చర్మం నిర్జీవంగా మారుతుంది. చర్మానికి కూడా పోషకాలు అవసరం ఎలాంటి రసాయనాలు లేని కొన్ని మాస్క్ లు చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కమల పండు తొక్కలను ఓ గిన్నెలో వేసి ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మూడు ఇ విటమిన్ క్యాప్సూల్స్ కలపాలి వీటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి ఆ రసాన్ని వడగట్టి దానికి అలోవెరా గుజ్జు కలిపి గాజు సీసాలో ఫ్రిజ్ లో భద్రపరచుకోవాలి ఇది నాలుగైదు వారాలు నిలువ ఉంటుంది. క్రీమ్ రాసుకునే ముందు ఈ సీరమ్  నాలుగు చుక్కలు ముఖానికి రాస్తే చర్మం తాజాగా మృదువుగా ఉంటుంది. రెండు స్పూన్ల చొప్పున కలబంద గుజ్జు బియ్యం కడుగునీరు తీసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజు నిద్ర పోయే ముందు రాసి ఆరిపోయాక మాయిశ్చరైజర్ రాస్తే ఉదయానికి చర్మం కాంతిగా తాజాగా ఉంటుంది.

Leave a comment