హిమాలయ ప్రాంతాలకు చెందిన మాత్ అంటే రెక్కల పురుగుల పై తీసిన డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన నోక్టర్న్స్ డాక్యుమెంటరీ,అమెరికాలో జరిగిన సన్‌డాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి ఈ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ ఆమె భర్త  అనిర్బన్ దత్తా తో కలిసి ఢిల్లీలో ఉంటారు. హిమాలయాల్లో ఉండే అందమైన రెక్కల పురుగులు పర్యావరణ మార్పులతో నశించిపోతున్నాయని తెలుసుకొని వాటి జీవన విధానాన్ని డాక్యుమెంటరీ గా తీశారు.డాక్యుమెంటరీ లో రెండే పాత్రలు ఉంటాయి. ఒకరు పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ రెండు హిమాలయాలకు చెందిన స్థానిక బిగున్  తెగకు చెందిన బికీ అనే గిరిజనులు ఉంటారు అతని సాయం తో మాన్సీ రెక్కలు పురుగుల కోసం చేసిన అన్వేషణ ఈ డాక్యుమెంటరీ.హిమాలయాల్లో అడవుల్లో జరిగిన ఈ షూటింగ్ ఎంతో శ్రమతో కూడుకున్నది ఎంతో తేమగా ఎప్పుడూ వర్షం పడే వాతావరణం. రాత్రి అయ్యాక ఒక తెల్లని తెరకట్టి  వెనకు నీల బల్బ్ వేలాడదీస్తే ఆ వెలుగు కోసం ఎన్నో అద్భుతమైన వర్ణాల రెక్కల పురుగులు వచ్చి వాలేవి వాటి కదలికలు చూస్తుంటే మనిషితో కలిసి అవి సహజీవనం చేసేందుకే ఉన్నాయనిపిస్తుంది అంటుంది అనుపమ శ్రీనివాసన్ ప్రకృతి సహజమైన దృణాలను ఆ రెక్కల పరుగుల జీవిత దృశ్యాలకు ఈ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది.

Leave a comment