తమిళనాడు కు చెందిన ప్రీతి శ్రీనివాసన్  క్రికెటర్ అమెరికాలో చదువుకున్న టాప్ స్టూడెంట్ 18 ఏళ్ల వయసులో వెన్నెముక పక్షవాతం రావడం తో వీల్ చైర్ కే పరిమితం అయింది. సొంత అనుభవాలతో ఈ దేశంలో దివ్యాంగుల గౌరవంగా జీవించగలిగిన స్థలం లేదని అర్థం అయ్యాక సోల్ ఫ్రీ పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. ఇక్కడ వెన్నుపాము సమస్యలున్న వారికి పూర్తి చికిత్స, పునర్వాసం, వైద్య సంరక్షణ విద్య కౌన్సిలింగ్ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ సంస్థ తిరువణ్ణామలై లో 2000 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో తీవ్ర వైకల్యంతో బాధ పడే 200 మందికి వసతి సదుపాయాలు అందజేస్తుంది ఫిజియోథెరపీ ,ఆక్యుపంక్చర్, హైడ్రోథెరపీ కౌన్సిలింగ్ స్టేషన్స్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తున్నారు.అలాగే ఆరోగ్యం మెరుగుపడే వారికి రీ-ఇంజినీరింగ్ పేరుతో ఆర్నెల్ల  పాటు శిక్షణ ఇస్తారు.ఇది వారికి ఆర్థికంగా నిలబడేందుకు ఉపయోగపడుతుంది.అథ్లెట్ గా జాతీయ స్థాయి స్విమ్మర్ గా జీవితం గడిపిన ప్రీతి తన 18 వ ఏట అనారోగ్య పాలైన తర్వాత తనలా కష్టపడే వారి కోసం ఈ పునరావాస కేంద్రాన్ని స్థాపించారు. ఇప్పుడు ఆమె వయసు 42 పిహెచ్.డి చేస్తుంది.అలాగే వికలాంగ సంక్షేమ సలహా మండలి సభ్యురాలుగా ఉన్నారు. వెన్ను విరిగిన వారికి బాసటగా నిలబడిన సోల్ ఫ్రీ స్ఫూర్తిదాయక జర్నీకి కర్త కర్మ క్రియ ప్రీతి శ్రీనివాసన్.

Leave a comment