ప్రకృతిలో ప్రతి జీవికి చుట్టు పరిసరాల మద్యనే పొంచి ఉంటే ఆపదల మద్యనే బతికే తెలివి తేటలు పుట్టుక తోనే వస్తాయని పిస్తుంది . బహియో పరిశిధకులు ఉద్యానవనాల్లో ఉండే ఉడతల పైన ఒక పరిశోధన చేశారు . చిన్ని పక్షులకు, ఉడతలకు ఒక ఎర్రితోక డేగ శత్రువు . అది ఎక్కడన్న కనిపించగానే పక్షులు ఉడతలు ,ఎక్కడివి అక్కడ బిగుసుకొని ఉంటాయి . ముందుగానే ఏ పక్షి అయినా దాన్ని చూస్తూ ఒక సంకేత ధ్వని ద్వారా హెచ్చరించు కొంటాయి . ఆ పాట ఉడతలకి పక్షులకు వచ్చు . శత్రువు వెళ్ళిపోగానే మళ్ళీ పక్షులు ,ఉడతలు చెట్ల పైకి గెంతుతూ ఆ సంకేత ధ్వని తో తాము క్షేమంగా గానే ఉన్నామన్న విషయాన్ని మిగతా వాటికీ పంచుతాయట . అంటే పక్షుల భాషనీ అవసరార్థం మిగతా జంతువులు నేర్చుకొంటాయని పరిశోధకులు చెపుతున్నారు . ఎత్తుగా ఎగిరే పక్షి శత్రువు వచ్చాడన్న విషయాన్ని ఒక సంకేత ధ్వనితో మిగతా వాటికీ చెపుతుందన్నా మాట.

Leave a comment