సాధారణంగా సబ్బులు ,షాంపూలు కొనే సమయంలో మంచి సువాసన వస్తున్నాయో లేదో చూస్తారు . మంచి గుబాళింపు ఉంటేనే వాటిని ఎంపిక చేస్తాం . లేకపోతే నచ్చవు . కానీ ఈ ఘాటైన సువాసనల షాంపూ,సబ్బులు,కండిషన్లు ఇతర కాస్మొటిక్స్ తో ఎలర్జీలు పెంపొందించే పదార్దాలు ఉంటాయంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నికెల్,లీనాలూల్, కోబాల్డ్ అనే పదార్దాలు ఎలర్జీ కారక గుణాలు కలసి ఉంటాయి . ఆక్సిడైజ్డ్,లినాలూల్ ఎగ్జిమా రావటానికి ఎక్కువ కారణం అవుతుంది . ఇది అనేక ఉత్పత్తుల్లో కనిపిస్తుంది . లావెండర్,మింట్ లలో సహజంగా కనిపించే సువాసనా పదార్ధం లినా లూల్ ఆక్సిజన్ తో కలిస్తే ఎలర్జీకి కారణం అవుతుంది .

Leave a comment