సాధారణంగా వాకింగ్ కోసం రన్నింగ్ కోసం మంచి షూస్ వేసుకొంటారు. కానీ ఇవేవీ లేకుండా వట్టి పాదాలతో నడవడం,పరుగెత్తడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. నేలపైన వట్టి పాదాలతో నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది.  రిఫ్రెష్ అయిన భావన కలుగుతుంది.పాదాల అన్ని నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఎముకలు లంగ్స్ పాదాల తోనే ముడిపడి ఉంటాయి. కనుక వట్టి పాదాలతో నేలపైన లేదా పచ్చని పచ్చిక పైన నడిస్తే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.చెప్పులు లేని పాదాలతో ప్రతి ఉదయం చల్లని పచ్చిక పైన చిరు ఎండలో నడిస్తే శరీరం రిలాక్స్ అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అరికాళ్ళలో ఉండే చిన్న నరాలు యాక్టివేట్ అవుతాయి. మోకాళ్ళు,కీళ్ల నొప్పులు తగ్గుతాయి.గ్రీష్ లేదా పచ్చని గడ్డి పైన ఉదయపు నడక అలవాటు చేసుకుంటే అదే చెప్పులు లేని కాళ్ళతో నడిస్తే ఎంతో ఆరోగ్యం.

Leave a comment