నెమ్మదిగా చలి తగ్గిపోతుంది. వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు చూసేందుకు పచ్చగా కాస్త ఎర్రగా కళ్ళకు విందు చేసే పుచ్చకాయల సీజన్ మొదలైంది. పుచ్చకాయ తినేనేదుకు రుచికరమనే కాదు. ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా రోజుకో స్లైస్ తప్పకుండా తింటే కోలేస్త్రోల్ తగ్గడం మాత్రమే కాదు, బరువు పెరగకుడా అదుపులో ఉంచుతుంది. పుచ్చకయలో వుండే సిట్రలాయిన్ అనే కెమికల్ ఈ విధమైన పనితీరుకు సహకరిస్తుందని అమెరికాలోని పర్ద్యు యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అత్యధిక కొవ్వు పదార్ధాల తో పాటు పుచ్చకాయ ఇచ్చి పరిశోధనలు చేయగా రక్తనాళాల్లో కొవ్వు డిపాజిట్ లను అడ్డుకోవడం తో పుచ్చకాయ బ్రహ్మాండంగా పనిచేసిందని వారు వివరించారు. వేసవి సిజన్ అనే కాదు సంవత్సరం పొడుగునా పుచ్చకాయ దొరుకుతూనే వుంటుంది కనుక రోజుకో ముక్క  తినడం పెద్ద సమస్యే కాదు. తప్పని సరిగా రోజులో ఎదో ఒక సమయంలో ఒక ముక్క తిని చూడండి.

Leave a comment