హై హీల్స్ తో స్టైల్ గా ఫ్యాష న్ గా నడవడం బావుంటుంది. కానీ ఈ ఫ్యాషన్ పోకడ తిప్పలు తెస్తాయి అంటున్నారు నిపుణులు. రెండు అంగుళాలు అంతకు మించిన ఎత్తు మడమల చెప్పుల్ని వారంలో 50 గంటల పాటు ధరించి మహిళలు రెండేళ్ళు అయ్యే సరికి అందుకు మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ప్లాట్స్ ధరించిన వాళ్ళ తో పోలిస్తే హై హీల్స్ తో నడక పట్టీ పట్టీ నడవడం వల్ల భిన్నంగా ఉంటుందని ఈ పట్టి పట్టి నడిచే ఒత్తిడి తో కండరాల్ల పై రాపిడి, ఒత్తిడి పెరుగుతాయంటున్నారు పరిశోధకులు. ఎక్కువ దూరం నడిస్తే అలసటే, కాలి వేళ్ళ కింది వైపుకి వంగి పిక్క కండరాళ్ళు కుచించుకు పోతాయి. టెండాన్ స్టిఫ్ గా మారుతుంది. దీని వల్ల గాయాలయ్యే అవకాసం వుంది. హై హీల్స్ వారంలో ఒకటి రెండు సార్లు అదయినా ఏ అకేషన్ కు ఒకటి రెండు గంటలు పర్లేదని, అది కూర్చోగానే చెప్పులు విదిచేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

Leave a comment