సైరీ చహాల్ షీరోస్ ఫ్లెక్సీ మామ్ వ్యవస్థాపకురాలు. ఢిల్లీలోని జవహర్ లాల్  నెహ్రూ విశ్వవిద్యాలయంలో రష్యన్ భాషా శాస్త్రంలో మాస్టర్స్ అంతర్జాతీయ దౌత్స పై సంబంధాల పై ఎంఫిల్ పూర్తి చేసింది సైరీ. 2011లో ఫ్లెక్సీ మామ్  సంస్థ ప్రారంభించింది. పెళ్లి తరువాత లేదా పిల్లలు పుట్టాక ఉద్యోగాలు చెయ్యాలనుకునే మహిళలకు అవకాశం కల్పించే వేదిక అది.మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి హక్కులను కాపాడేందుకు 2014లో షీరోస్ అనే సంస్థ కు ప్రాణం పోసిందామె. ఈ షీరోస్ ఆప్ మహిళల కోసమే పని చేస్తుంది ప్రస్తుతం షీరోస్ యాప్ ద్వారా కోటిన్నర మంది  మహిళలకు సేవలు అందిస్తున్నారు. ఇది అతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్.

Leave a comment