ఈ ఏడాది నా కెరీర్ కు చాలా  ఉత్సాహాన్ని తెచ్చింది ట్రిప్లెక్స్  రిటర్న్ ఆఫ్ వండర్ కేజ్  తో పటు అద్భుత సౌందర్య రాశిగా పేరున్న మహారాణి పద్మినిని చారిత్రాత్మిక పాత్రలో నటించబోవటం నేనెంతో గర్వంగా ఫీలవుతున్నాను అంటోంది దీపికా పదుకొనె. ప్రేక్షకులతో డ్రీమ్  గర్ల్ అని పిలిపించుకున్న హేమ మాలిని నన్ను ఈ తరం డ్రీమ్ గర్ల్ అనటం కూడా నాకెంతో సంతోషాన్నిచ్చింది. పీకూ, బాజీరావ్ మస్తానీ వంటి నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే కాదు గ్లామర్ పాత్రలూ  నాకోసం వచ్చాయి. నేనేవీ ఎంచుకున్నవి కాదు. సవాల్ గా  అనిపించేపత్రాలు నేను కోరుకుంటాను. అలాంటివి నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. పద్మావతి అవకాశం కూడా అలా వచ్చింది  అన్నారామె. ఆమె నటించిన హాలీవుడ్ చిత్రంలో సెరెనా ఉంగర్ అనే చిలిపి అమ్మాయిగా నటించింది. గ్లామర్ గా కనిపించటంతో పాటు భారీ ఫైట్లు కూడా చేసిందిట దీపికా.

Leave a comment