ఈ సీజన్స్ లో వచ్చే ఉసిరి నిజంగా ఆరోగ్యానికి దివ్యౌషధం అనే చెప్పాలి. ఇందులో C విటమిన్ తో పాటు ఐరన్ ,కాల్షియం , ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. పచ్చడి మురబ్బా క్యాండీ జ్యూస్ ఏ రూపంలో తీసుకున్నా  మంచిదే. ఇది సహజ సిద్దమైన కండీషనర్. ఉసిరి నూనె, వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించటంతో పాటు ఆరోగ్యవంతమైన కేశ సంపదను ఇస్తుంది. ఉసిరి రోజు ఆహారంతో టీయూస్కుంటే చర్మానికి మంచి మెరుపొస్తుంది. కంటి చూపును మెరుగు పరిచి బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో చెడు  కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులకు ఔషధం పరగడుపున ఉసిరి రసం పుక్కిటపడితే నోటి పుండ్లు తగ్గుతాయి. ఉసిరిపొడి తేనే కలిపి తీసుకుంటే గొంతుమంట , జలుబు పోతాయి.

Leave a comment