ఒక వయసు దాటాక గర్భం ధరిస్తే ఎన్నో సమయస్యలుంటాయని ఎంతో మంది అభిప్రాయం. కానీ తాజా పరిశోధనలు 35 దాటినా తర్వాత కలిగిన చివరి సంతానానికి మెరుగైన మేధాశక్తి ఉంటుందంటున్నారు. ఏడేళ్ల పాటు హార్మోనల్ గర్భ నిరోధక మాత్రలు వాడిన తర్వాత తల్లయిన  వారి  పిల్లలు ఎంతో తెలివిగా ఉంటారని తేల్చాయి పరిశోధనలు. 24 ఏళ్ళు ఇంకా ఎక్కువ వయసులో తొలిసారి గర్భవతులైతే వారిలో నిర్వహణా  పటిమ ఏకాగ్రత వృత్తి పరమైన జ్ఞాపక శక్తి హేతు బద్ధత సమస్య పరిష్కారం సామర్ధ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చింది. ఈ దశలో ఈస్ట్రోజెన్ ,ప్రొజెస్టెరాన్ హార్మోన్లు చైతన్యవంతంగా ఉన్నాయని ఇవి మెదడు రసాయన శక్తిని పనితనాన్ని  అస్థిత్వాన్ని ప్రభావితం చేస్తాయని చెపుతున్నారు. వయసు ముదిరాక గర్భం దాల్చితే స్త్రీలలో ఈ హార్మోన్లు ఎక్కువ చైతన్యవంతంగా ఉన్నాయిట. అందుకే సంతానం కలగటంలో ఆలస్యమైనా నష్టం లేదని  ఈ పరిశోధనలు స్పష్టం చేసాయి.

Leave a comment