Marble inlay అనేది ప్రాచీనమైన పాలరాతి అలంకరణ.ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా పాలరాతి పనితనానికి పేరెన్నికగన్నది. మేఘాలయాల కాలం నుంచి మార్బుల్ ఇన్ లే పనితనానికి పెట్టింది పేరుగా ఉంది. అలంకరణ వస్తువులు శిల్పాలు ఇతర కళాఖండాలను పాలరాతితో అందంగా డిజైన్ చేసి విలువైన రాతితో లేదా బంగారు తాపడం తో అందంగా చెక్కుతారు. ఈ జిల్లా లోని కళాకారులు తయారు చేసే పాల రాతి శిల్పాలను దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఉపయోగిస్తారు విభిన్న మూర్తులను వస్తువులను మార్బుల్ మెటల్ ఇన్ లే వర్క్ తో తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. అందమైన పాల రాతి పై బంగారు తీగను అమర్చి చక్కని డిజైన్లు తయారు చేయటమే మార్బుల్ ఇన్ లే కళగా చెప్పుకోవచ్చు.

Leave a comment