వేసవి ఎండలకు మేకప్ చెదరకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. ముందుగా మొహానికి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ రాయాలి. ఇది ఎండవేడికి చర్మానికి జిడ్డు గా మార నివ్వదు. తర్వాత ఎండ ప్రభావం నుంచి రక్షణ గా చర్మ తత్వాన్ని సరిపోయే సన్ స్క్రీన్ క్రీమ్ రాయాలి. ఆపై మేకప్ ప్రైమర్ తప్పనిసరి కొద్ది పరిమాణంలో కన్సీలర్ అద్దుకోవాలి. చెమట కు అవకాశం ఉండే నుదురు,చుబుకాలు, ముక్కు, గడ్డం ప్రాంతాల్లో పౌడర్ బ్రాంజెర్ రాయాలి. మాడుకు అప్లై చేయచ్చు. ఇది మోహాన్ని మెడను తాజాగా కనిపించేలా చేస్తుంది. వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ అయితే చెమటకు కరగదు. మోహ చర్మ వర్ణానికి తగిన లిప్ స్టిక్ కానీ కనిపించని లిప్ లైనర్ అధరాల అందాన్ని పెంచుతాయి. ఈ కాలంలో తక్కువ మేకప్ కే ప్రాధాన్యత ఇవ్వాలి.
Categories