కదిలే పని లేకుండా డెస్క్ జాబ్ చేసే వాళ్లను మెడ, నడుము భుజాల నొప్పులు వేధిస్తాయి. బయట వ్యాయామం చేసే సమయం దొరక్క పోతే కనీసం డెస్క్ ఎక్సర్ సైజ్ చేయమంటున్నారు ఎక్సపర్ట్స్. నడుము నొప్పి గా ఉంటే కుర్చీలో కూర్చునే ఇరుపక్కల స్ట్రెచ్ చేయాలి. కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలను నేలకు ఆన్చి చేతులను మోకాళ్లపై ఉంచాలి ఇప్పుడు భుజాలు గుండ్రంగా తిప్పాలి. కాసేపు గడ్డం ఛాతికి తగిలేలా వంగి కాసేపు అలాగే ఉండాలి. వీటిని ఒకసారి తర్వాత మారుస్తూ నాలుగైదు సార్లు చేస్తే మెడ భుజాలు రిలాక్స్ అవుతాయి కుర్చీలో వెనక్కి వాలి కూర్చొని తల వెనక రెండు చేతులను ఆన్చి వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా పది సార్లు చేస్తే, మెడ భుజాలు నడుము కు వ్యాయామం అవుతుంది.

Leave a comment