చర్మం పొడిబారకుండా కొబ్బరి నూనె రాస్తుంటారు చలి గాలులు నుంచి రక్షణ ఇచ్చే ఈ కొబ్బరినూనెతో ఒక రాత్రిలోనే మెరిసే దంతాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. రాత్రి పడుకునే ముందు పళ్ళ కు కొబ్బరి నూనె పూయాలి. ఉదయం బ్రష్ చేసుకుంటే తెల్లని దంతాలు చూసుకోవచ్చు అంటున్నారు. అలాగే గోళ్లు మెరవాలంటే కూడా గోరువెచ్చని కొబ్బరి నూనె గోళ్ళకు పట్టించి మృదువుగా మర్దన చేయాలి. ఆ నూనె చేతులకు పట్టిస్తే, చేతులు, గోళ్లు మెరుస్తాయి. పాదాల పగుళ్ళు సమస్య కు కొబ్బరి నూనె మంచి పరిష్కారం. పడుకునే మందర పాదాలకు గోరువెచ్చని కొబ్బరి నూనె మర్దనా చేసి సాక్స్ వేసుకుని పడుకుంటే అది పాదాలను హైడ్రేట్ చేయటమే కాక మృదువుగా మారుస్తుంది.

Leave a comment