వినూత్నమైన ఫ్యాషన్ డిజైన్లను రూపొందించింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు తెచ్చుకుంది రేఖ గుప్తా. టిష్యూ పేపర్ తో చేసిన, గౌను మైనం తో చేసిన, డ్రెస్ ఫెవికాల్ తో చేసిన, తెల్లని దుస్తులు స్వచ్ఛమైన బంగారం తో రూపొందించిన లెహంగా వైట్ సిమెంట్ తో చేసిన డ్రెస్ లిక్విడ్ సోప్ తో చీరె ఇలా విభిన్నమైన ఏడు రకాల దుస్తులకు ఆమెను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ తీసుకున్న రేఖ ఉత్తరప్రదేశ్ లో బరేలీ జిల్లా లో పుట్టారు సాంప్రదాయ దుస్తులకు భిన్నంగా ఏదైనా సృష్టించాలని ఆమె సైన్స్ ప్రయోగాలు చేశారు మైనం, బొగ్గు చేప తో ఆమె సృష్టించిన డ్రెస్ ప్రశంసలు పొందింది.

Leave a comment