కుసుమ పువ్వును డూప్లికెట్ శాఫ్రాన్ అంటారు. దాని కాడలు, గింజలు అన్ని అద్భుతమే ఈ పూ రేకుల్ని ఫుడ్ కలర్ గా ఔషధాల తయారికి వాడతారు. మహారాష్ట్రకు చెందిన నికంబర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్‌ పొడి వాతావరణంలో పండేలా హైబ్రీడ్ వెరైటీలు రూపొందించింది. గింజలతో తయారు చేసే కుసుమ నూనెలు విటమిన్ ఇ సమృద్దిగా ఉండటంతో ఇది చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. జుట్టు కుదుళ్ళకు దీన్ని పట్టిస్తే ఆరోగ్యంగా పెరగడంతో పాటు జుట్టు మెరిసిపోతుంటుంది. మొహనికి ఈ నూనెతో మసాజ్ చేస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు పోతాయి. కుసుమ పువ్వు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. కుసుమ ఆకుల్లో మెంతి, పాలకూరల్లో కంటే యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. వీటిని ఔషధాల్లో ఎక్కువగా వాడతారు.

 

Leave a comment