సింపులుగా కనిపించాలంటే తక్కువ నగలుండాలి. చేతికి గాజు చాలు. అది ప్రత్యేకంగా కనిపించే మొఘల్ గాజు అయితే మరి బావుంటుంది. మొఘల్ గాజుల్లో అన్ కట్ డైమాండ్స్, రూబీస్, ఎమరాల్డ్ ముత్యాలు, గో మెధికాలు, పూసలు వాడతారు. అందుకే ఇన్ని రాకాల రాళ్ళతో ఈ గాజు బరువుగా ఉంటుంది. సంప్రదాయ వేడుకలకు కూడా ఇవి స్పెషల్ ఎట్రాక్షన్. ఎన్ని రంగుల జాతి రాళ్ళు ,వజ్రాలు పొదుగుతారు కనుక కంజీవరం ఎలాంటి రంగు చీరైన మ్యాచ్ అవుతాయి. లేదా కట్టిన చీరకు మ్యాచ్ అవ్వదన్న భయం కూడా అక్కర్లేదు. ఈ పనితనం ఉట్టిపడే బరువైన గాజు ఏ చీరకైన కరెక్ట్ మ్యాచింగ్. సింపుల్ గా ఉండే వస్త్ర శ్రేణి అయిన సరే.

Leave a comment