కథక్ ఒడిస్సా నృత్యాలను నేర్చుకొన్న కత్యా  తొషేవా బల్గేరియా పౌరురాలు. బల్గేరియా లోని సోఫియా ఆమె స్వస్థలం. భర్త పేరు రోజున్ జెన్ కొవ్. రకరకాల వాద్యాలు నేర్చుకొని తబలా పైన సెటిల్ అయ్యారు  కత్యా కు నాట్యాం ఇష్టం. ఈ భార్యా భర్తలు భారత్ కు వస్తూనే ఉంటారు. బల్గేరియా లో భారతీయ సంస్కృతి తో ముడిపడ్డ ఇందిరా గాంధీ పేరున్న ఒక పాఠశాల నాట్య పాఠాలు బోధిస్తుంది కత్వా. ప్రతి నెలా వర్క్ షాప్ లు నిర్వహించి,ప్రపంచంలో భారత సంస్కృతి ఎంత ఉన్నతమైనదో ప్రసంగాలు చేస్తారు. గ్రీన్,సైప్రస్,స్పెయిన్,ఫ్రాన్స్ సెర్బియా దేశాల్లో ఈమె నృత్య ప్రదర్శనల కు ప్రశంసలు దక్కాయి. మాకు ఇండియా అంటే గౌరవం,ఇష్టం అంటారు ఈ దంపతులు.

Leave a comment