Categories
సఖులూ….అందరు చక్కగా “భీష్మ ఏకాదశి” పర్వదినాన్ని జరుపుకున్నాము.
వరంగల్ జిల్లాలోని మేడారంలో జరిగే సమ్మక్క,సారలమ్మ జాతరకి వెళ్దాము రండి.
గిరిజన తెగల జాతరే ఈ సమ్మక్క,సారలమ్మ జాతర.కాకతీయుల పరిపాలనలో ఈ గిరిజనులు భూములకు కప్పాలు కట్టలేక యుద్ధ భూమిలో ప్రాణ త్యాగాలు చేసిన గిరిజనులు.తెలంగాణా ప్రాంతంలో అతి పెద్ద జాతర. 4 రోజుల ఉత్సవం.దేశంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మలను పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు.ఇక్కడ అమ్మలకు బంగారం అంటే బెల్లంను సమర్పించుకుంటారు.
సఖులూ!!మనం కూడా ఈ నాలుగు రోజులు గిరిజనుల జాతరను చెప్పుకుందాం.
నిత్య ప్రసాదం: కొబ్బరి, బెల్లం
-తోలేటి వెంకట శిరీష