చేనేత అంటే ముతక. పెద్దవాళ్ళు కట్టుకునేలా అనుకునే కాలం పోయింది. ఇప్పుడు నేత వస్త్రాలు మోడరన్ డిజైన్ లలో ఏ వయసు వారికైనా చక్కగా అమరిపోతున్నాయి. పైథాని, కోటా కాటన్,సిల్క్ కోటా, పాటో లా ,పోచంపల్లి ఇకత్ గద్వాల్ మంగళగిరి వంటి వాటిలో చక్కని డిజైనర్ శారీస్ వస్తున్నాయి. కంచి కాటన్,ఢాకా మజ్లాన్ మొహమాల్ కాటన్ మంగళగిరి లో కొత్త రంగులు డిజైన్లు వచ్చాయి అలాగే ఖాదీ కాటన్,వచ్చేశాయి. ఇకత్ కలంకారీ ప్రింటులో చక్కని ప్రాగ్ లు స్కర్ట్ ల మీద ఉండే టాప్ లపైనా కాకుండా అనార్కలి కుర్తాల పైన వేసుకోవచ్చు. గద్వాల క్రాప్ టాప్ పైన లెహరియా చెందిన దుపట్టాలు చక్కని మ్యాచింగ్. మొత్తం ఫ్యాషన్ ప్రపంచం కాటన్ చుట్టునే తిరుగుతోందనటంలో అతి శయోక్తి లేదు.

Leave a comment