సి ఫుడ్ ఎంట్రప్రెన్యూర్‌ గా దేశాన్ని రక్షిస్తోంది సుభిక్ష. బెస్త కుటుంబంలో పుట్టిన సుభిక్ష ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుంది. తండ్రి, అన్న సముద్రం పైన చేపల వేటకు వెళ్లే వృత్తిలో ఉన్నారు.మత్స్యకారుల జీవితాలను వీడియో చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన సుభిక్ష అసలు సిసలైన బెస్త జీవనం గడపాలనుకుంది. తండ్రి, అన్నతో చేపల వేటకు వెళ్లి ఆ వేట పద్ధతులు నేర్చుకుంది. స్వయంగా చేపల వేట చేసి, తెచ్చిన చేపలను ఊరగాయలు, పచ్చళ్ళు చేసి తన లేబుల్ తో అమ్ముతోంది సుభిక్ష. ప్రోటీన్ నిండిన రిచ్ ఫుడ్ చేపలు. ఆ చేపల వేట లో బెస్తలు ఎంత కష్టపడతారో ప్రపంచానికి చూపించాలనుకున్నాను అంటుంది సుభిక్ష.

Leave a comment