Categories
ఇన్ స్టా లో ‘ట్రాన్స్ ఆఫ్ కొచ్చిన్’ పేరు తో ఉండే ప్రతి చెట్టు గురించి వాటి చరిత్ర ను సేకరించి పరిచయం చేస్తున్నారు అశ్వతి జెరోమ్. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో పీజీ చేసి కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు అశ్వతి. ఈమె పుట్టిన ఊరు కొచ్చి.మొక్కలు, పర్యావరణం పైన అవగాహన కలిగించేందుకు నో యువర్ నైబర్ హుడ్ ట్రీ వాక్, పార్క్ వాక్ వంటివి నిర్వహిస్తున్నారు. పిల్లలకు పెద్దలకు ప్రకృతిని పరిచయం చేయడం తన కర్తవ్యం అంటున్నారు అశ్వతి.