Categories
ఎలాంటి చర్మతత్వం ఉన్నా ఈ సీజన్ లో చేతులు,కాళ్ళు,పగలటం సహజం. చలిగాలికి చేతులు బిరుసెక్కిపోతాయి. తరచుగా చేతులను వేళ్ళని గోరు వెచ్చని కొబ్బరి,ఆలివ్ నూనె లో మర్ధన చేసి ఆ నూనె అలాగే కాసేపు ఉంచుకుని కడుక్కుంటే చక్కగా మృదువుగా మారుతుంది. రంగు పోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్ల సొనలో కొంఛెం తేనె రెండు మూడు చుక్కలు నిమ్మరసం కలిపి చేతులు మర్ధన చేసుకుని పూతగా వేసుకోవాలి. ఇలా చేసినా చేతులు మృదువుగా ఉంటాయి. వెన్నలో కొంచెం బాదం నూనె కలిపి మర్ధన చేయాలి. విటిలో ఉండె విటమిన్ చర్మానికి మేలు చేస్తుంది.