గులాబీల అందమే అందం. ఎన్ని రంగుల గులాబీలు సృష్టించారు లెక్కలేదు. బొకేలుగా అమర్చేప్పుడు పెళ్ళిళ్ళకి పువ్వుల డిజైన్లు చేసినప్పుడు గులాబీలను ఎన్ని రకాలుగా చేస్తారో లెక్కలేదు. ఉదాహరణకు అవలాంచి రోజాలు చాలా తెల్లగా చెప్పలేనంత అందంగా ఉంటాయి. వీటిని ఫ్లోరోసెంట్ రంగుల్లో ముంచటం వల్ల అవి పగలు మాములు గులాబీ పువ్వుల్లా రాత్రిపూట దివ్యమైన కాంతి వెదజల్లుతున్నట్లు ఉంటాయి. అలాగే చెట్టుకే హరివిల్లు రంగుల గులాబీ పుసిందా అన్నట్లు కనిపించే రెయిన్బో రోజాలు ఇంకా స్పెషల్. తెల్లని పువ్వు కాడను నిలువుగా చీరి ఒక్కో చీలిక ఒక్కో ద్రవణంలో మునిగేలా పెట్టటంలో ఆరంగులు పీల్చుకుని రేకలు ఎన్నో రంగుల్లోకి మారిపోతాయి. ఎంతో సహజంగా అందంగా ఉంటాయి. వీటిని శాటిన్ బట్టల్లా మెరిపించాలన్నా క్రీమ్ కేక్ లాగా ఉండాలన్నా శాటిన్ రంగులో ఉంచటం ప్యాక్ క్రీమ్ లాంటి మైనంతో ముంచటం తో పువ్వులు అచ్ఛం అలాగే వికాశంబియా అనేలా చేస్తున్నారు. ప్రకృతే మనిషి గుప్పెట్లో వదిగిపోతుంది.
Categories
WoW

చీకట్లో మెరుస్తాయి రంగుల్లో వెలుస్తాయి

Leave a comment