Categories
మేకప్ ఒక చక్కని కళ. ఎక్సెపర్ట్స్ సలహాతో కొన్ని చిట్కాలతో మెహం అందం వెయ్యింతలు అవుతుంది. ఐ లైనర్ తో కళ్ళు విప్పారినట్లు కనిపిస్తాయి. ఐ లైనర్ క్రీమ్ బేస్డ్ గా కనురెప్పల పైన మెత్తగా జరుగుతుంది. వాటర్ ప్రూఫ్ బిల్డ్ ఇన్ స్మడ్జర్ క్రీమ్ ఐ లైనర్ ఎంచుకోవాలి. అద్దం కాస్త కూర్చున్న దాని కంటే కిందకు పెట్టుకుంటే కళ్ళను కిందకు వంచి ఐ లైనర్ వేసుకోవచ్చు. లైన్ సరిగ్గా రావాలంటే కన్ను మొదలు నుంచి కను రెప్పలకు కొద్దిగా పై వరకు వరసగా మూడు,నాలుగు చుక్కలు పెట్టి ఆ తరువాత ఆ చుక్కలని కలిపి లైన్ గీసుకుంటె వంకర లేకుండా వస్తుంది.