Categories
కళ్ళు మూసేదాకా ఆ కళ్ళు చక్కగా పని చేయాలి. నిరంతరం చూస్తూ ఉండాలి. చక్కగా చదువుతూ మెదడుకి చైతన్యం అందించాలి అల చక్కని కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు ఖనిజాలు కావాలి . లుటెన్ ,జయోగ్జాంథన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకు కూరలు, కోడిగుడ్లు ,బ్రకోలి స్వీట్ కార్న్ తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కాప్సికం,పాలకూర వంటివి తరుచూ తినాలి. ముడి ధాన్యాలు ,బాధం ,ఆక్రోట్, చేపలు ,గుడ్లు ,అవిసె గింజలు, మాంసాహారం, పాలు, బీన్స్ ఇవన్నీ కంటి చూపును కాపాడే ఆహారపదార్ధాలు రెగ్యూలర్ గా ఆహారంలో తీసుకోవాలి. లేదా ఇవన్నీ ఏ కాంబినేషన్స్ తో తీసుకొంటే డైటిషియన్ సలహా తీసుకోవాలి.