Categories
కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో దాన్ని శుభ్రం చేయటం కూడా అంతే ముఖ్యం. ఫేస్ మాస్క్ ధరించిన ప్రతిసారీ దాన్ని ఉతకాలి ఫేస్ మాస్క్ పైన డిజ్ ఇన్ ఫెక్టెంట్ స్ప్రే చేయటం మంచిది కాదు.ఇది మాస్క్ పైన క్రిములు చంపుతోంది.కానీ ఇది చల్లిన మాస్ పెట్టుకున్నప్పుడు శ్వాస తీసుకుంటే ఈ వాసన గాఢత చాలా ఇబ్బంది పెడుతుంది. ముక్కు, నోరు, గడ్డం పైన చర్మం మంటగా ఉంటుంది అందుచేత తప్పని సరిగా మాస్కులు వేడి నీళ్లలో ఉతకాలి,వస్త్రం తో కుట్టిన మాస్క్ లు వాషింగ్ మిషన్ లో,సబ్బుతో ఉతకాలి. లేదా చేత్తో ఉతికి వేడి నీళ్ళలో ముంచి ఎండలో ఆర వేసి వాడుకోవటం ఉత్తమం.